చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇది కదా హీరోయిన్ మెటీరియల్ అనేలా.. ఫిజికల్ స్ట్రక్చర్ ఓ రేంజ్లో ఉంటుంది. అమ్మడి అందానికి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలగాల్సింది. అయితే అందం ఉన్నప్పటికీ.. అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆ క్యూట్ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
చివరగా మాస్ మహారాజా నటించిన ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన రిజల్ట్ అందుకుంది. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. వారిలో క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ కూడా ఒకరు. దాంతో.. ఈ బ్యూటీ ఫ్లాప్ సెంటిమెంట్ వల్లే రావణాసురకు దెబ్బ పడిందనే కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే.. అమ్మడి ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి. ఇప్పటి వరకు మేఘ ఆకాష్ నటించిన సినిమాలేవి కూడా పెద్దగా ఆడలేదు. ‘లై’, ‘చల్ మోహన్ రంగ’ వంటి సినిమాలతో పాటు చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
తెలుగులో ‘రాజరాజ చోర’ తప్పితే ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన గుర్తుందా శీతాకాలం, రావణాసుర కూడా ఫ్లాప్ అయ్యాయి. కోలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన ఇదే పరిస్థితి. అందుకే.. మేఘా ఆకాష్ నటిస్తే.. ఆ సినిమాల సంగతి ఇక అంతే.. అనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో అమ్మడి సినీ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీస్ వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఇప్పుడు మేఘా ఆకాష్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం.
తమిళనాడుకు చెందిన ఓ పొలిటీషియన్ కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఎవరితో ప్రేమలో ఉందనే విషయంలో ఎలాంటి వార్తలు బయటికి రాలేదు. కానీ త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించిన మను చరిత్ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు కొన్ని తమిళ సినిమాల్లోను నటిస్తోంది అమ్మడు.