Chiranjeevi : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చాలా రోజులుగా మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ కూడా చిరు కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఉంటుందని తెలుస్తోంది. గతేడాది కార్తి హీరోగా వచ్చిన ‘సర్దార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించాడు. అయితే సర్దార్ సక్సెస్‌లో భాగంగా.. వెంటనే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా.. మెగాస్టార్‌తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను చిరు కుమార్తే సుస్మిత కొణిదెల నిర్మించనున్నారట. రీసెంట్గా శ్రీదేవి శోభన్ బాబు అనే చిత్రాన్ని నిర్మించిన సుస్మిత.. రెండో చిత్రాన్ని తండ్రి మెగాస్టార్‌తోనే ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.