సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. దూరం నుంచి చూస్తే కలర్ ఫుల్‌గా ఉంటుంది.. కానీ ఒక్కసారి అందులోకి దిగితేనే దాని అసలు రంగు తెలుస్తుంది. ఇచ్చిన వారికి అడగకుండానే ఇస్తుంది.. అడిగిన వారికి ఇచ్చినట్టే ఇచ్చి జీవితాన్ని చీకట్లోకి నెట్టెస్తుంది. ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి చెప్పుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అనిల్ సుంకర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏకంగా ఈ మెగా ప్రొడ్యూసర్ 200 కోట్లు లాస్ అయినట్టు లెక్కలు వేస్తున్నారు.
Bhola Shankar: మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ భయపడినట్లే భోళా శంకర్ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్యతో కమ్ బ్యాక్ ఇచ్చిన చిరుకి మెహర్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌ని ఇచ్చాడు. రెండో రోజు కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదంటే.. భోళా శంకర్ డ్యామేజ్ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు మెగాస్టార్ ఈ రీమేక్ సినిమాను ఎందుకు చేశాడు? అనేది ఎవ్వరికి అంతు పట్టకుండా ఉంది. పైగా హిట్ టాక్ తెచ్చుకున్న రజనీ కాంత్ ‘ జైలర్’ భోళా శంకర్‌ని మరింత దెబ్బ తీసింది. దీంతో ఈ సినిమా భారీ నష్టాలను చూస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమామను ఏకె ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. కానీ భోళా శంకర్ టాక్ ఈయనకు యాభై కోట్లకు పైగా నష్టం తెచ్చిపెట్టేలా ఉందంటున్నారు. గతంలో దూకుడు, లెజెండ్, సరిలేరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నిర్మాతగా భాగమైన అనిల్ సుంకర.. ఇప్పుడు మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోతున్నాడు.
గత రెండేళ్లలో ఈయన నిర్మించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన ‘మహాసముద్రం’ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు కనీసం ప్రమోషన్స్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఇక పోయిన సమ్మర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా అఖిల్ ‘ఏజెంట్’ సినిమా నిలిచింది. అసలు అఖిల్ మార్కెట్‌కు సంబంధం లేకుండా.. ఏకంగా 80 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్‌ను నిర్మించాడు. ఈ సినిమా కూడా 50 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు భోళా శంకర్ రిజల్ట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. అయితే ఇటీవల అనిల్ సుంకర నుంచి వచ్చిన ‘సామజవరగమన’ మాత్రం మంచి విజయాన్ని అందుకొని.. మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఆ లాభాలతోపాటు నష్టాలను ఇస్తూ భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. రీసెంట్గా తన సమర్పణలో వచ్చిన ‘హిడింబ’ కూడా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలా రెండేళ్లలో ఈ మెగా ప్రొడ్యూసర్ దాదాపు 200 కోట్ల వరకు లాస్ అయ్యాడని అంటున్నారు.