»Manjummal Boys %e0%b0%ae%e0%b0%82%e0%b0%9c%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d %e0%b0%ac%e0%b0%be%e0%b0%af%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%93%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80
Manjummal Boys: చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపిన చిత్రాలలో మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ కూడా ఉంటుంది. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఇతర బాషాల్లో కూడా డబ్బింగ్ అయి మంచి విజయాన్ని మూటగట్టుకుంది. అన్ని భాషా చిత్రాలను ఆదరించే మన తెలుగు వాళ్లు సైతం ఈ సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఇక మన దగ్గర కూడా మంచి వసుళ్లనే రాబట్టింది. ఇంకా కొంత మంది ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని రూ. 20 కోట్లతో నిర్మిస్తే అన్ని భాషాల్లో కలిపి రూ. 250 కోట్లకు పైగా వసుళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం హాట్ స్టార్లో మే 3 నుంచి స్ట్రీమింగ్ అవబోతుంది అని అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ కానుంది. కొడైకెనాల్లో 2006లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగాఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లో విడుదల అందరి ఆదరణ పొందిన ఈ మూవీ ఓటీటీలో విడుదలై మరింత ఎక్కువ మందకి చేరువ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.