»Kareena Kapoor Who Will Take Divorce Because Of Karan Johar Koffee With Karan 8th Season
Karan johar: కారణంగా డివోస్ తీసుకోనున్న కరీనా కపూర్?
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అలియా భట్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 కొత్త ప్రోమో వీడియోలో కనిపించారు. అయితే ఈ వీడియోలో కరణ్ జోహార్ సోఫాలో కూర్చున్న హీరోయిన్లను పలురకాల కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసిన పలువురు కరణ్ కారణంగా కరీనా డివోస్ తీసుకునే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.
kareena Kapoor who will take Divorce because of Karan johar koffee with karan 8th season
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8(Koffee with Karan 8) ఇటివల ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మొదట దీపికా పదుకొణె-రణవీర్ సింగ్, ఆ తర్వాత అనన్య పాండే-సారా అలీ ఖాన్ వచ్చారు. ఆ నేపథ్యంలో వారిని క్రేజీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ప్రొమో వీడియోలో ఆలియా భట్(alia bhatt), కరీనా కపూర్ ఖాన్(kareena Kapoor) వంతు వచ్చింది. అయితే వీరు చాలా సరదాగా కనిపించారు.
ఆ క్రమంలోనే కరణ్ జోహార్(Karan johar) కరీనా కపూర్ ను కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారు. అదే సమయంలో అలియా భట్ గురించి కూడా వివాదాస్పదమైన ప్రశ్నలు సంధించారు. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘గదర్ 2’ చిత్రం ఈ ఏడాది విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలించింది. దీంతో పలువురు బి-టౌన్ సెలబ్రిటీలు హాజరైన ఈ సినిమా సక్సెస్ పార్టీకి నటుడు హోస్ట్ చేశారు. అయితే కరీనా కపూర్ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాఫీ విత్ కరణ్‌లో గదర్ సక్సెస్ పార్టీకి ఎందుకు హాజరు కాలేదని కరీనాను అడిగారు. కరీనా ఆశ్చర్యపోయి, “నేనా?” అని అడుగుతుంది.
అంతేకాదు అమీషా పటేల్ చరిత్రపై కరణ్ జోహార్ వ్యాఖ్యాలు చేస్తాడు. అమీషా పటేల్‌కు మీకు ఎంటి సంబంధమని కరణ్ ప్రశ్నిస్తాడు. మీకు తెలియకపోతే అమీషా పటేల్ కంటే ముందు కరీనాకు హృతిక్ రోషన్ నటించిన ‘కహో నా ప్యార్ హై’ చిత్రం వచ్చిందని గుర్తు చేస్తాడు. ఆమె ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. అయితే చివరి క్షణంలో కరీనా సినిమా నుంచి తప్పుకుంది. విభేదాల కారణంగా కరీనాను రాకేష్ రోషన్ సినిమా నుంచి తప్పించారని అమీషా తెలిపింది.
కరీనా కపూర్ ఒకసారి ఫిల్మ్‌ఫేర్‌తో సంభాషణలో అమీషా పటేల్ గురించి స్టేట్మెంట్ ఇచ్చింది. రాకేష్ రోషన్ తన కొడుకు కోసమే ‘కహో నా ప్యార్ హై’ సినిమా తీశాడని చెప్పింది. అమీషా పటేల్‌ని అందంగా చూపించలేదని…అమీషా ముఖంపై మొటిమలు, కళ్ల కింద మచ్చలు ఉన్నాయి. ఆమె అందంగా కనిపించడం లేదు. కానీ తాను ఆ సినిమా చేయనందుకు సంతోషంగా ఉందని కరీనా చెప్పింది. అయితే ఈ వీడియో ప్రొమో చూసిన నెటిజన్లు కరణ్ జోహర్ కారణంగా ఏదో ఒక సమయంలో కరీనా విడాకులు తీసుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్(comments) రూపంలో తెలియజేయండి మరి.