»Kamal Haasan Tweets That He Is Proud Of The Oscar For Rrr
Kamal Hasan: RRRకు ఆస్కార్‌పై గర్విస్తున్నానంటూ కమల్ హాసన్ ట్వీట్
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(OSCAR Award) సాధించింది. ప్రపంచాన్ని ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు'(Natu Natu) పాట తట్టిలేపింది. ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ ను ఈ పాట సొంతం చేసుకుంది. దీంతో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్(RRR) రికార్డుకెక్కింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్(OSCAR) సాధించడంతో తెలుగు సినిమా గర్విస్తోంది.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(OSCAR Award) సాధించింది. ప్రపంచాన్ని ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు'(Natu Natu) పాట తట్టిలేపింది. ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ ను ఈ పాట సొంతం చేసుకుంది. దీంతో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్(RRR) రికార్డుకెక్కింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్(OSCAR) సాధించడంతో తెలుగు సినిమా గర్విస్తోంది.
‘నాటు నాటు'(Natu Natu) పాట ఆస్కార్ అవార్డును సాధించడంతో ఆర్ఆర్ఆర్(RRR) మూవీ టీమ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ వంటివారు, సినీ సెలబ్రిటీలు, ఇంకా మరెంతో మంది ఇతర రంగాలకు చెందినవారు ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ ను ప్రశంసిస్తున్నారు.
తెలుగు సినిమాను ప్రపంచానికి చాటిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)కి దక్కిందని అభినందిస్తున్నారు. అవార్డును అందుకున్న ఎంఎం కీరవాణి(MM keeravani), రచయిత చంద్రబోస్ ను ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలను అభినందిస్తున్నారు.
తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Hasan) ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ దక్కడంపై స్పందించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు'(Natu Natu) సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంపై కమల్ హాసన్ స్పందిస్తూ..తోటి కళాకారుడిగా, భారతీయుడిగా గర్విస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ రాజమౌళి(Rajamouli), మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM keeravani), ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.