Project K: యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ప్రాజెక్ట్ కే (Project K) గురించి మరో అప్ డేట్ వచ్చింది. సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, దిశా పటనీ నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనిదత్ నిర్మిస్తోండగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (nag ashwin) డైరెక్షన్ చేస్తున్నారు. మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు పైగా ఉందని తెలిసింది.
ప్రాజెక్ట్ కే విలన్ గురించి తెలిసింది. ఇందులో విలక్షణ నటుడు కమల్ హాసన్ (kamal haasan) విలన్ రోల్ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కమల్ (kamal) విలన్ రోల్ చేస్తే సినిమా హైప్ మరింత పెరుగుతోంది. కమల్ కోసం అశ్వనిదీత్ భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. మొత్తం 20 రోజుల డేట్ల కోసం రూ.150 కోట్ల ఇచ్చేందుకు అంగీకరించారట. అంటే రోజుకు రూ.7.50 కోట్ల మొత్తం ఇవ్వనున్నారు.
ప్రాజెక్ట్ మూవీపై ఇప్పటికై హైప్ నెలకొంది. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తారని తెలియడంతో మూవీ రేంజ్ పెరిగిపోయింది. మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతోందనే సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే (Project K) అంటే కృష్ణ లేదంటే కర్ణ అనే అర్థంలో ఉంటుందట. మైథలాజికల్ అంశాలు, సూపర్ మేన్ అంశాలను జోడించి టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కేను ఆరు పార్టులు (సిరీస్) తీయాలని అనుకుంటున్నారని తెలిసింది. వెబ్ సిరీస్ అయితే ఆరు పార్టులు.. మూవీ అయితే రెండుగా వచ్చే అవకాశం ఉంది.