»Kalyan Ram Devil Movie Release Postponed From November 24th
Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ వాయిదా? కారణం అదే!
బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత వచ్చిన అమిగోస్‌తో హిట్ కొట్టలేకపోయాడు. అందుకే.. అప్ కమింగ్ ఫిల్మ్ 'డెవిల్(devil)' పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.
Kalyan Ram Devil movie release postponed from november 24th
కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) స్టైల్. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ మధ్య వచ్చిన అమిగోస్ మూవీతో ఆకట్టుకోలేకపోయాడు. డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. కానీ నటన పరంగా ట్రిపుల్ రోల్ చేసి దుమ్ముదులిపేశాడు.
ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ నుంచి ‘డెవిల్(devil)’ అనే సినిమా రాబోతోంది. పీరియాడిక్ డ్రామాగా భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నఈ చిత్రానికి.. నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. కానీ ఏమైందో ఏమోగానీ.. చివరకు నిర్మాత పేరునే దర్శకుడిగా వేసుకున్నారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవుతుండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. నవంబర్ 24 నుంచి వాయిదా పడిన డెవిల్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.