జాన్వీ కపూర్ తెలుసు కదా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. ఒకప్పుడు శ్రీదేవి ఇండస్ట్రీని ఎలా తనవైపునకి తిప్పుకుందో.. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్‌ను తనవైపునకు లాక్కుంటోంది. తను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది. శ్రీదేవి ఈలోకంలో లేకున్నా.. తన కూతురు జాన్వీలో ఆమెను చూసుకుంటున్నారు అభిమానులు.
జాన్వీ కపూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్ నెస్ ఫ్రీక్ అని చెప్పుకొవాలి. ఫిట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి. తను జిమ్‌లో చాలా కసరత్తులు చేస్తుంది. తాజాగా జిమ్‌లో తను చేసిన కసరత్తుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్టి లాగు వేసుకొని జిమ్‌లో చాలా కష్టపడింది జాన్వీ. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫిట్ నెస్ కోసం ఇంతలా కష్టపడుతున్నావా? అంటూ జాన్వీ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.