»Jagapathi Babus Role In The Movie Rudrangi Scared Him
Jagapathi Babu: రుద్రంగిలో నా పాత్ర చూస్తే నాకే భయం వేసింది
జగపతి బాబు లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం రుద్రంగి. ఈ చిత్రంలో ఆయన పాత్రకు విచిత్రమైన మ్యానరిజమ్ ఉంటుందట, దాని వలన తన పాత్రను చూసి జగపతిబాబే భయపడ్డారట.
Jagapathi Babu's role in the movie Rudrangi scared him
సీనియర్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టి విలన్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా తరువాత నేమ్, ఫేమ్ తో పాటు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కేవలం విలన్ రోల్ లోనే కాకుండా సాహాయక పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ సీనియర్ నటుడు. గ్రామీణ ప్రాంతంలో విలన్ నుంచి స్టైలిష్ కార్పొరేట్ విలన్ వరకు అన్ని పాత్రల్లో మెప్పించగలరు. తాజాగా జగపతి బాబు లీడ్ రోల్ లో నటించిన మూవీ రుద్రంగి(Rudrangi). ఈ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందు రానుంది. బ్యూటిఫుల్ హీరోయిన్లు మమతా మోహన్ దాస్(Mamatha Mohan das) – విమలా రామన్(Vimala Raman) ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు(Jagapathi Babu) మాట్లాడుతూ .. రుద్రంగి చిత్రంలో నేను ‘భీమ్ రావ్ దేశ్ ముఖ్’ పాత్ర పోషించానని. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక దొర పాత్రను పోషించడం ఇదే మొదటి సారి అని, నా పాత్రకి ఈ సినిమాలో ఒక చిత్రమైన మేనరిజం ఉంటుంది అని అందువలన నా పాత్రను చూసుకుంటే నాకే భయం వేసింది అని చెప్పుకొచ్చారు. ఇంకా తన పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆసక్తి ఉన్నట్లు తెలిపారు.
దర్శకుడు అజయ్ సామ్రాట్(Ajay Samrat) మాట్లాడుతూ .. “రుద్రంగి మూవీలో ఒక కొత్త జగపతిబాబును చూస్తారు. అంత పవర్ఫుల్ గా ఆయన పాత్రను డిజైన్ చేయడం జరిగిందని. తన పాత్ర నేపథ్యం గురించి తెలుసుకుంటూ, అందుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ను జగపతిబాబు సెట్ చేసుకున్నారు అని అన్నారు. ఇక ఈ మూవీలో ‘రుద్రంగి’ పాత్ర చుట్టూ కథ తిరుగుతూ ఉన్నప్పటికీ, జగపతిబాబు పాత్ర ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది” అని చెప్పుకొచ్చారు.