Rudrangi: తెలుగు పరిశ్రమలో తక్కువ టైమ్ లోనే మంచి సినిమాలు చేసిన అనుభవం ఉందని నటీ నవీన రెడ్డి(Naveena Reddy) అన్నారు. రుద్రంగి (Rudrangi) సినిమా అవకాశం గురించి మాట్లాడుతూ.. ఒక రోజు డైరెక్టర్ అజయ్ సామ్రాట్ (Ajay Samrat) తన ఆఫీస్ లో రుద్రాంగి కథ మొత్తం చెప్పారు. కథ విన్న తరువాత తన క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తుండగా… నాగమణి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పిచ్చిది. ఇంకా మంచి పాత్ర ఇచ్చి ఉంటే బాగుండేది అనుకున్నా.. తరువాత ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. షూటింగ్ జరుగుతున్న సమయంలో తోటి ఆర్టిస్టులు చాలా ప్రొత్సహించారు. ఆర్టిస్టుగా ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి పాత్రలు చేయాలని అప్పుడు ఫిక్స్ అయినట్లు తెలిపారు.
ఆశిష్ గాంధీ(Ashish Gandhi) మాట్లాడుతూ.. తనకు ర్యాండమ్ కాల్ రావడంతో సరే చూద్దాం అని డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లానని, అక్కడ అజయ్ సామ్రాట్ చెప్పిన స్టోరీ నెరెషన్ విని చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యానని చెప్పారు. ముందు ఈ సినిమా చిన్న సినిమా అనుకున్నానని ఆ తరువాత జగపతి బాబు, విమాల రామన్, మమతా మోహాన్ దాస్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత పెద్ద సినిమా అని అర్థం అయ్యిందని తెలిపారు. మూవీలో తన పాత్ర పేరు మల్లేషం.. ఇది చాలా మాస్ గా ఉంటుందని తెలిపారు. ఇక జగపతి బాబు గురించి మాట్లాడుతూ.. భీమ్ రామ్ దేశ్ ముఖ్లో అతని గెటప్, మ్యానరిజమ్ మూవీకి హైలెట్‌గా నిలుస్తోందని చెప్పారు.