గత కొన్ని రోజులుగా కమెడియన్ కిరాక్ ఆర్పీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో కర్రీ పాయింట్ పెట్టాడు. ఇప్పుడంతా ఆ చేపల పులుసు గురించే నెట్టింట చర్చ నడుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కిరాక్ ఆర్పీ ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే కొంత మంది మాత్రం చేపల పులుసు రుచి పరంగా అస్సలు బాలేదని చెబుతూ కొన్ని వీడియోలు చేశారు. తాజాగా జబర్దస్త్ మరో కమెడియన్ అయిన రాకింగ్ రాకేష్ ఆర్పీ చేపల పులుసుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ ఆర్పీ చేపల పులుసుపై కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష వల్ల ఆర్పీ ఆ వ్యాపారం చేసుకుంటున్నాడని రాకేష్ అన్నాడు. ఆర్పీని ఈ మధ్య కలిశారా అని యాంకర్ ప్రశ్నించగా రాకేష్ బదులిస్తూ.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం తనకు లేదని, తామంతా చిన్న ఆర్టిస్టులమని, వాళ్లు చాలా పెద్దవాళ్లు అని తెలిపాడు. ప్రస్తుతం రాకింక్ రాకేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.