»Is Shaakuntalam Movie So Bad Samantha Character Negative Talk
Samantha: ‘శాకుంతలం’ మరీ ఇంత దారుణమా!?
నటి సమంతా రూత్ ప్రభు నటించిన చిత్రం 'శాకుంతలం(Shaakuntalam)' ఏప్రిల్ 14న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా లవ్ స్టోరీగా తెరకెక్కించారు. కానీ సమంత(samantha ruth prabhu) ఈ చిత్రంలో అస్సలు సూట్ కాలేదని పలువురు అంటున్నారు.
సమంత లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం(Shaakuntalam)’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై సమంత భారీ ఆశలే పెట్టుకుంది. యశోద సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న సామ్.. శాకుంతలంతో మరో హిట్ అందుకోవాలని చూసింది. కానీ ఈ సినిమా చూసిన వాళ్లు.. శకుంతల పాత్రలో సమంత(samantha ruth prabhu) సెట్ అవలేదని అంటున్నారు. అసలు చూడ్డానికి కూడా సామ్ బాగోలేదనే కామెంట్స్ వినిస్తున్నాయి.
అందుకే కాబోలు ఈ సినిమా ప్రీమియర్ షోష్ కూడా క్యాన్సిల్ చేశారని చెప్పొచ్చు. గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. ఏండ్లకేండ్లు ఈ ప్రాజెక్ట్ పై పని చేశారు. ముఖ్యంగా శాకుతంలం సినిమాతో విజువల్ వండర్ ట్రీట్ ఇవ్వాలని అనుకున్నారు. త్రీడిలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ తీరా ఈ సినిమా థియేటర్లోకి వచ్చాక నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలే కాదు పబ్లిక్ టాక్ కూడా దారుణంగా ఉంది. సమంతతో పాటుగా సినిమాలో గ్రాఫిక్స్ కూడా పేలవంగా ఉన్నాయని అంటున్నారు.
సమంత క్రేజ్ కూడా పట్టించుకోకుండా.. చాల చోట్ల ఈ సినిమా మార్నింగ్ షోకు థియేటర్లు ఖాళీగా కనిపించాయి. సినిమా ఎంత బాగాలేకున్నా.. కనీసం వన్ డే అయినా అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. కానీ మ్యాట్నీ షోకే శాకుంతలం పనైపోయిందని అంటున్నారు. ఎంతలా అంటే.. ఇదే రోజు రిలీజ్ అయిన లారెన్స్ ‘రుద్రుడు’ సినిమా ఓపెనింగ్స్.. శాకుంతలం కంటే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా శాకుంతలం.. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచేలా ఉందంటున్నారు. మరి శాకుంతలం రికవరీ ఎలా ఉంటుందో చూడాలి.