సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సమంత ఇండస్ట్రీలో గట్టెక్కాలంటే రాబోవు సినిమాలు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
నాగ చైతన్య(Nagachaitanya), సమంత (Samantha) ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారుతుంది. ఈ ఇద్దరు విడిపోయి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా సమయం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు టాక్ ఆఫ్ ది న్యూస్‌గా మారుతుంటారు. అయితే చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంది. ఆ సమయంలో సమంత డిప్రెషన్(Depression)లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో కొన్నాళ్లు బాధపడింది. ఇప్పటికీ అమ్మడు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పాలి. మధ్య మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్(Health Problems) ఫేజ్ చేస్తునే ఉంది.
రీసెంట్గా శాకుంతలం సినిమా(Shaakuntalam Movie) రిలీజ్ అయిన టైంలోను సమంత(Samantha) ఫీవర్‌తో బాధపడింది. అయితే సామ్ ఒక్క హెల్త్ పరంగానే కాదు.. సినిమాల పరంగాను రేసులో వెనకబడిపోయింది. చైతూతో విడిపోయాక సమంత నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. అలాగే పుష్ప ఐటెం సాంగ్(Item song) కూడా వచ్చింది. ఈ సాంగ్ సెన్సేషనల్‌గా నిలిచింది. కానీ సినిమాలు మాత్రం ఘోరపరాజయాన్ని ఇచ్చాయి. పుష్ప ఐటెం సాంగ్ తర్వాత కోలీవుడ్ నుంచి ‘కాతువాకుల రెండు కాదల్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది సామ్. ఇందులో విజయ్ సేతుపతి(Vijaysetupathi) హీరో.. నయనతార మరో హీరోయిన్. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. ఇక ఆ తర్వాత ‘యశోద’గా వచ్చింది సమంత. ఈ సినిమా కాస్త హిట్ అనిపించుకుంది. అయితే మయోసైటిస్ సింపథినే ఈ సినిమాను నిలబెట్టింది.
ఇక రీసెంట్గా వచ్చిన ‘శాకుంతలం’ సినిమా(Shaakuntalam Movie) మాత్రం సామ్ కెరీర్లోనే దారుణం అంటున్నారు. గుణశేఖర్ అసలు ఈ సినిమా ఎందుకు చేశాడా? అనే విమర్శలు వస్తున్నాయి. సమంత(Samantha) ఫేస్‌లో గ్లో కూడా మిస్ అయింది. దీంతో గుణశేఖర్‌తో పాటు సమంత పని కూడా అయిపోయిందనే టాక్ నడుస్తోంది. నాగ చైతన్య(Nagachaitanya)తో విడిపోయిన తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయింది సామ్. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ(Vijaydevarakonda)తో ‘ఖుషి’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలైనా అమ్మడిని గట్టెక్కిస్తాయా? అంటే ఖచ్చితంగా చెప్పలేం. మొత్తంగా చైతన్యతో విడిపోయాక సమంత ఫేడ్ అవుట్ అయ్యే దిశగానే పయనిస్తోందని చెప్పొచ్చు.