సోషల్ మీడియా వచ్చాక స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎలాంటి న్యూస్ బయటికొచ్చినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అందులో నిజముందా, లేదా? అనేది పక్కన పెడితే.. అలాంటి వార్తలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా స్టార్ బ్యూటీ సమంత అప్పుల పాలైందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Samantha: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. భారీగా పారితోషికం పెంచేసింది స్టార్ హీరోయిన సమంత. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో వచ్చిన క్రేజ్‌తో.. ఒక్కో సినిమాకు 4 నుండి 5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోను భారీ సినిమాలకు సైన్ చేసింది. యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ సమంత హెల్త్ కారణంగా కమిట్ అయిన మిగతా సినిమాలను కంప్లీట్ చేయలేకపోయింది. ఎన్ని సినిమాలకు సంతకం చేసినా.. విజయ్ దేవరకొండ ‘ఖుషి’, వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ మాత్రమే పూర్తి చేసింది.
మయోసైటిస్ కారణంగా.. పూర్తిగా కోలుకోలేకపోయిన సమంత, కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు.. ఆ సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం విదేశాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి షికార్లు చేస్తోంది సమంత. త్వరలో అమెరికాకకు వెళ్లి మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకోబోతోంది. ఇందుకోసమే సమంత అప్పుల పాలైనట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ట్రీట్మెంట్కు ఖర్చు అయ్యే 25 కోట్లను.. ఓ స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకుందట సామ్. అతనెవరు? అనేది తెలియకపోయినా.. అసలు సమంతకు అప్పు చేయాల్సిన అవసరం ఏముందనేదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సమంత.. ఆ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఉందా? అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? ఇదే నిజమైతే.. అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అసవరం ఏముంది? అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొందరు ఇవి ఒట్టి పుకార్లేనని అంటుంటే.. ఇంకొందరు మాత్రం చెప్పలేం అంటున్నారు. సమంత అప్పు అనేదే.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.