మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గురించి అందరికీ తెలిసిందే. మళయాళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. తెలుగులో సీతారామం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. దీంతో మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఈ ఇద్దరికి తెలుగులో భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. దుల్కర్ కూడా మరో తెలుగు ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం దుల్కర్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోటా’ సినిమా ఆగష్టులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా దుల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విశేషాలతో ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. సతీమణి అమల్ సూఫియాకు తన స్టార్డమ్ గురించి ఏ మాత్రం అవగాహన లేదని, ఓ సాధారణ ఇల్లాలిగానే ఆమె ప్రవర్తిస్తుందని చెప్పారు. తన తండ్రి మమ్ముట్టి నటుడిగా తన విజయాల పట్ల సంతోషంగా ఉన్నారని, అయితే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక అని తెలిపారు.
‘తాను సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసిన రోజులున్నాయి. కానీ నువ్వు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు కూడా చేయట్లేదు. ఇలా అయితే ఇంకోసారి ఇంట్లోకి రానివ్వను’ అని చెప్పారట మమ్ముట్టి. అలాగే.. తన భార్య అమల్ సూఫియా గురించి చెబుతూ.. ఆమె దృష్టిలో నటన అంటే ఒక ఉద్యోగం లాంటిది. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటే చాలని అనుకుంటుంది. అంతకు మించి తన నుంచి ఏమీ ఆశించదు’ అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. దీంతో దుల్కర్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.