»I Will Not Do The Work Given How Many Crores Sai Pallavi
Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని మాత్రం చెయ్యను?
లేడీ పవర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఎన్ని కోట్లు ఇచ్చిన సరే, ఓ పని మాత్రం అస్సలు చేయనని తెగేసి చెబుతోందట. లేటెస్ట్గా రెండు కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎందుకు?
I will not do the work given how many crores? Sai Pallavi
Sai Pallavi: సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. తన రూట్ మాత్రం సపరేటుగా ఉంటుంది. సాయి పల్లవి సినిమా ఒప్పుకుందంటే.. ఆటో మేటిక్‌గా ఆ సినిమా పై హైప్ క్రియేట్ అవుతుంది. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలతో పాటు.. కథా బలం ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తోంది సాయి పల్లవి. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ మధ్య కాస్త తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పల్లవి.. ప్రస్తుతం నాగ చైతన్య సరసన చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీతగా నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చేస్తోంది పల్లవి.
అయితే.. సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో.. మిగతా విషయాల్లో కూడా అలాగే ఉంటుంది ఈ అమ్మడు. కమర్షియల్ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు సాయి పల్లవి యాడ్స్ చేసిన సందర్భాలు లేవు. కానీ.. లేడీ పవర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉండడంతో.. పలు బడా సంస్థలు పల్లవితో యాడ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అందుకోసం కోట్లకు కోట్లు ఆఫర్ చేస్తున్నాయి. అయినా కూడా నో చెప్పెస్తుందట అమ్మడు. లేటెస్ట్గా.. రెండు కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. స్కిన్ ఫెయిర్నెస్కు సంబంధించిన ఓ యాడ్ కోసం ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట. అయినా కూడా సాయి పల్లవి నో చెప్పిందట. ఏదేమైనా.. అసలే ఈ న్యాచురల్‌గా ఉండే సాయి పల్లవి.. ఇలాంటి యాడ్స్ చేయడమనేది చాలా కష్టం చెప్పాలి.