Pallavi Prashanth: దండం పెట్టి చెప్తున్నా.. నేనెక్కడికీ పారిపోలేదు
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయాడు అనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడికి పారిపోలేదని ఓ వీడియోను విడుదల చేశాడు పల్లవి ప్రశాంత్.
Pallavi Prashanth: బిగ్ బాస్ 7(Big Boss7) విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)పై కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఆయన పరారిలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తాను ఎక్కడికి పారిపోలేదని ఇంట్లోనే ఉన్నానని ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆదివారం రోజు జరిగిన గొడవకు తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. షో నుంచి ఇంటికి వచ్చిన తరువాత తాను ఫోన్ వాడలేదని తెలిపారు. కావాలనేే కొంత మంది ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, వాళ్ల పేర్లు కూడా తనకు తెలుసు అని పేర్కొన్నారు.
ఆదివారం గ్రాండ్ ఫినాలే రోజు టైటిల్ గెలిచిన తరువాత అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు రన్నరర్ అమర్ ధీప్ అభిమానులకు గొడవ జరిగింది. ఈ ఘటనలో అమర్ కారు అద్దాలు కూడా పగిలాయి. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దాలు పగిలాయి. అలాగే డ్యూటీలో ఉన్న బెటాలియన్ బస్సు అద్దాలు కూడా పగలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనంతటికిి కారణం పల్లవి ప్రశాంత్ అని తనను ఏ1, తన సోదరుడు మనోహర్‌ను ఏ2 గా చేర్చారు.