Prabhas : ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్, లీక్డ్ లుక్స్ చూస్తే.. ఆ విషయం అర్థమవుతోంది.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సలార్’ పై భారీ అంచనాలున్నాయి. కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్, లీక్డ్ లుక్స్ చూస్తే.. ఆ విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఇదే ఊరమాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సలార్.. నెక్స్ట్ షెడ్యూల్‌తో పూర్తి కానుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయలతో భారీ సెట్‌ని వేశారట. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ఈ సెట్లోనే ప్రభాస్ ఎలివేషన్ షాట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. ఈ షెడ్యూల్‌తో మెజారిటీ సూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28 న ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కెజియఫ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది హోంబలే ఫిల్మ్స్. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మళయాళ టాలెంటెడ్ హీరో కమ్ డైరెక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియానే అనుకున్నప్పటికీ.. ఇప్పుడు పాన్ వరల్డ్ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారట. అందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు టాక్. మరి సలార్ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.