అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనంగా నిలిచిందో తెలిసిందే. అందుకే సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా..
భారీ బడ్జెట్ మరియు స్టార్ క్యాస్టింగ్‌తో సెకండ్ పార్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు సుకుమార్. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిందని.. త్వరలోనే వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలో పుష్ప2 షూటింగ్ పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప 2లో మరో పవర్ ఫుల్ లేడీ విలన్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో మళయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అలాగే సునీల్, అనసూయ కూడా నెగెటివ్ రోల్లోనే నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో లేడీ విలన్ రోల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. హాట్ బ్యూటీ కేథరిన్ ట్రెసాను సుకుమార్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఆమెను నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ ఫుల్ కాప్‌గా చూపించబోతున్నాడట సుకుమార్.
గతంలో అల్లు అర్జున్, కేథరీన్ ‘ఇద్దరమ్మాయిలతో’.. ‘సరైనోడు’ మూవీలో కలిసి నటించారు. ఆ సినిమాల్లో బన్నీ-కేథరీన్ పెయిర్ భలేగా వర్కౌట్ అయింది. దాంతో మరోసారి ఈ హిట్ జోడి ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే ఈ సారి బాలీవుడ్ నుంచి కూడా విలన్లను రంగంలోకి దింపుతున్నాడ సుక్కు. అయితే.. కేథరీన్‌తో పాటు ‘పుష్ప2’లో నటించబోయే కొత్త నటీనటుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.