Nayanatara: మరో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టిన నయన్
సినిమా రంగంలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న నయనతార ఇప్పుడు వ్యాపారరంగంలోకి కూడా అడుగుపెట్టింది. కాగా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన రంగంలోనే బిజినెస్ ను చేస్తున్నట్లు సమాచారం.
లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా పేరుతెచ్చుకున్న ఈవిడ.. ఒక్క సినిమాకు రూ.10కోట్ల పారితోషకం అందుకుంటోంది. ఈవిడ క్రేజ్ ఎంతగా ఉందంటే… నయన్ నటించిన లేడీ ఓరియెంటెండ్ సినిమా ప్రతీది దాదాపుగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. నిర్మాతగాను మారిన ఈవిడ పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీంతో పాటే డిస్ట్రిబ్యూషన్ లో కూడా అడుగుపెట్టింది. జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నయన్ సినిమా ఇండస్ట్రీలోనే పలు వ్యాపారాలు చేస్తుంది.
నయనతారకు ఉన్న క్రేజ్ ఆధారంగా… పలు వాణిజ్య ప్రకటనలలో నటిస్తోంది. ఎక్కడచూసినా నయనతార కటౌట్ లు రోడ్లపై కనిపిస్తుంటాయంటే అతిశయోక్తికాదు. ఇలా అన్నిరంగాలలో రాణిస్తున్న నయనతార ఇప్పుడు థియేటర్ అధినేతగాను అవతరించనుంది. తొందరలోనే నయన్ కు చెందిన సినిమా థియేటర్లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే… నటుడు శివాజీ గణేషన్, నగేష్, ఏవీఎం శెట్టియార్ వంటి వారు థియేటర్ అధినేతలుగా రాణించారు.
కాగా పలు ప్రసిద్ది చెందిన థియేటర్లు మూతపడుతున్న తరుణంలో… ఆ థియేటర్లను నయనతార కొనుగోలు చేసి మల్టీ ప్లెక్సీ థియేటర్లుగా మారుస్తున్నారు. చెన్నైలో ఇటీవల మూతపడ్డ థియేటర్ అగస్యను నయనతార కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మాల్స్ తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్గ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.