ఎట్టకేలకు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను లాక్ చేశారు మేకర్స్. అయితే.. ముందుగా అనుకున్న దానికంటే ఈ ఈవెంట్‌ను మరో చోటికి, అంటే ఒరిజినల్ ప్లేస్‌కి మార్చారు. దీంతో గుంటూరు కారం మరింత హీటెక్కబోతోంది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం.. గుంటూరు మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమేషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా పై ఒక్కసారిగా హైప్‌ని పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కనిపించిన ట్రోలింగ్.. ట్రైలర్ దెబ్బకు పాతాళానికి వెళ్లిపోయింది. ఖచ్చితంగా గుంటూరు కారం మహేష్ ఫ్యాన్స్‌కు మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని.. ట్రైలర్‌తో చెప్పేశాడు త్రివిక్రమ్.
కేవలం 12 గంటల్లో 25 మిలియన్స్‌కి పైగా డిజిటల్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ వైపు దూసుకుపోతోంది గుంటూరు కారం ట్రైలర్. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరబాద్‌లో నిర్వహించిన మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాత్రం ఒరిజినల్ ప్లేస్‌లో నిర్వహించబోతున్నారు. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో.. జనవరి 9న గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
ఈ ఈవెంట్‌కి మహేష్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఈ వేదిక పై గుంటూరు కారం కాకుండా.. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏదైనా చిన్న అప్డేట్ ఉంటుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్ నోట రాజమౌళి పేరొస్తే చాలు.. స్టేజీ, ఆడిటోరియం దద్దరిల్లిపోతుంది. ఏదేమైనా.. గుంటూరు కారం ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.