‘గాడ్ ఫాదర్’కు భయమా.. అసలు ఛాన్సే లేదు. కానీ ఓ విషయంలో మాత్రం భయపడినట్టే తెలుస్తోంది. భయం అంటే ఇంకేదో అనుకునేరు.. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే హిందీలోను గాడ్ ఫాదర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో జరిగిన మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ వస్తాడని భావించారు. కానీ రాలేకపోయారు. దాంతో ముంబైలో ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ముంబైలోనే కాదు.. అసలు ఈ దేశంలోనే కాకుండా.. మరో దేశంలో మెగా ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో సెక్యూరిటీ టైట్ చేశాడు సల్లు భాయ్. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేడు సల్మాన్. ఇలాంటి సమయంలో ముంబైలో గాడ్ పాదర్ ఈవెంట్ రిస్క్ అని భావిస్తున్నారట. అందుకే సల్మాన్ ఖాన్ భద్రత నేపథ్యంలో.. ముంబై ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఫైనల్‌గా దుబాయ్‌లో భారీ ఎత్తున మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి నిజంగానే ముంబై ఈవెంట్ రద్దయిందా.. దుబాయ్ వేడుక ఉంటుందా.. అనేది తెలియాలంటే.. మరో రెండు, మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.