మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ‘నజ భజ జజర.. సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మెగాస్టార్ ఎలివేషన్‌తో ఈ ట్రాక్ థియేటర్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’ ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తనదైన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్‌తో ‘గాడ్ ఫాదర్’ పై అంచనాలను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు మెగాస్టార్. ఫ్యాన్స్ కూడా ఆన్ లైన్, ఆఫ్ లైన్లో పీక్స్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓ పక్క మెగాభిమానులు, మరోపక్క మెగాస్టార్ ప్రమోషన్స్‌తో సోషల్ మీడియాలో ‘గాడ్ ఫాదర్’ ట్రెండ్ అవుతునే ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన యంగ్ హీరో సత్యదేవ్ ‘గాడ్ ఫాదర్’ గురించి అంచనాలను పెంచేస్తున్నాడు. మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఖుషీ అవుతున్న సత్యదేవ్.. ‘గాడ్ ఫాదర్’ ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఇంటర్వెల్ కూడా అదిపోనుందనే న్యూస్ మెగాభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. ఇలా అన్ని విధాలుగా థియేటర్లోకి రాకముందే ‘గాడ్ ఫాదర్’ దుమ్ములేపడం విశేషమనే చెప్పాలి. మరి ఆచార్యతో డిసప్పాయింట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. గాడ్ ఫాదర్‌తో ఎలాంటి హిట్ ఇస్తారనేది తెలియాలంటే.. అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.