Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్!
శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్లో షూట్ చేస్తున్నారట.
కోలీవుడ్(Kollywood) స్టార్ డైరెక్టర్‌తో ఎవరు ఊహించని విధంగా సాలిడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు టాలీవుడ్(Tollywood) బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju). అది కూడా మెగా పవర్ స్టార్‌తో! ట్రిపుల్ ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్(Ramcharan). దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్లో షూట్ చేస్తున్నారట.
శంకర్ ‘గేమ్ ఛేంజర్'(Game Changer Movie) ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు.. షూటింగ్‌ను పరుగులు పెట్టించాడు. కానీ దిల్ రాజు(Dil Raju), చరణ్((Ramcharan)) ఊహించినట్టే మధ్యలో ఇండియన్ 2 ఎంట్రీ ఇచ్చేసింది. దాంతో చేసేది లేక.. ఇండియన్2, గేమ్ ఛేంజర్ సినిమాలను ఈక్వల్‌గా షూట్ చేస్తున్నాడు శంకర్(Director Shankar) . రీసెంట్‌గానే ఇండియన్ 2 ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్లైమాక్స్‌ను వెయ్యి మంది ఫైటర్లతో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.
ప్రస్తుతం సిటీ అవుట్ కట్స్‌లో వేసిన భారీ సెట్లో ఈ క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్స్ కోసం కెజిఎఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివ్ బ్రదర్స్‌ని రంగంలోకి దింపాడు శంకర్(Director Shankar) . క్లైమాక్స్ షూట్లో భాగంగా.. గన్స్ లోడింగ్ అంటూ ఫైట్ మాస్టర్ స్లైలీష్‌గా గన్ను పట్టుకుని నిలుచున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో కెజియఫ్కి మించి గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక కియరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. రామ్ చరణ్(Ramcharan) తండ్రి కొడుకుగా డ్యూయెల్ం రోల్ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే చరణ్ క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి గేమ్ ఛేంజర్(Game Changer Movie) ఎలా ఉంటుందో చూడాలి.