Animal: ఫైనల్‌గా ‘యానిమల్’ ట్రైలర్ కొత్త డేట్ ఫిక్స్!
ఎట్టకేలకు ఫైనల్‌గా బాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'యానిమల్' ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంతకు ముందు వినిపించిన డేట్ కంటే.. మరో రెండు రోజులు వెనక్కి వెళ్లింది యానిమల్ ట్రైలర్.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోతున్న మరో సెన్సేషన్ మూవీ యానిమల్. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 1న యానిమల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. ముందుగా ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పుడు మరో కొత్త డేట్‌ను లాక్ చేస్తూ.. అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్.
ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ బాగుంది. ఇకపోతే.. ప్రమోషన్స్‌లో భాగంగా ‘యానిమల్’ టీమ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే అందుకు సబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాపులర్ టాక్ షోకలో హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు.
అన్‌స్టాపబుల్‌లో ఈ షో పాన్ ఇండియా ఎపిసోడ్‌గా.. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ షో కోసం తెలుగుతో పాటు హిందీ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో యానిమల్ పై భారీగా అంచనాలు వున్నాయి. మరి యానిమల్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.