బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మందిరా బేడీ గతంలో క్రికెట్ ప్రజెంటర్‌గా పని చేశారు. తాజాగా దీనిపై మందిర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2003లో వరల్డ్ కప్‌కు నేను ప్రజెంటర్‌గా పనిచేశా. తొలివారం రోజులు ఎంతో కంగారుపడ్డా. క్రికెట్ లెజెండ్స్‌తో మాట్లాడే సమయంలో నేను అడిగిన ప్రశ్నకు కాకుండా వాళ్లకు నచ్చిన జవాబు చెప్పేవారు. అది నాకు అగౌరవంగా అనిపించింది. ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఏడ్చేశాను’ అని చెప్పారు.