»Family Star Flop Talk Is That Hero And Producer Full Of Happiness
Family star: ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ టాక్.. ఆ హీరో, నిర్మాత ఫుల్ హ్యాపీనా?
అరె.. విజయ్ దేవరకొండ ఎంత కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్తాడో.. ఆ సినిమా రిజల్ట్ ఖచ్చితంగా తేడా కొట్టేస్తోంది. లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ విషయంలోను ఇదే జరగబోతున్నట్టే కనిపిస్తోంది వ్వవహారం. దీంతో ఓ ఇద్దరు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Family star flop talk.. Is that hero and producer full of happiness?
Family star: ‘గీతగోవిందం’ తరువాత దర్శకుడు పరుశురామ్‌తో కలిసి మరోసారి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దిల్ రాజు నిర్మిస్తున్న కావడం ఒకటైతే.. హిట్ జోష్‌లో ఉన్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించడంతో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్స్ అయితే పీక్స్‌లో చేశారు. మొత్తంగా.. భారీ అంచనాలతో ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చింది ఫ్యామిలీ స్టార్. అయితే.. డే వన్ నుంచి ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కథలో కొత్తదనం లేదని.. సీరియల్లా ఉందని అంటున్నారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే.. డే వన్ 5 కోట్ల నెట్‌తోనే ఫ్యామిలీ స్టార్ సరిపెట్టుకుంది.
అయితే.. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ వల్ల రౌడీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే.. ఓ ఇద్దరు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కాగా, ఇంకొకరు అక్కినేని నాగ చైతన్య. వాస్తవానికైతే.. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించాల్సి ఉంది. కానీ మధ్యలోనే గీతా ఆర్ట్స్ నుంచి బయటికి వచ్చేశాడు పరుశురాం. అప్పట్లో ఈ విషయంలో అల్లు అరవింద్ చాలా సీరియస్ అయ్యాడు. అలాగే.. ఈ సినిమాను నాగ చైతన్య చేయాల్సి ఉంది. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇదే విషయాన్ని నాగ చైతన్య దగ్గర ప్రస్తావించగా.. పరుశురామ్ గురించి నన్ను అడక్కండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ చెప్పుకొచ్చాడు. అతను నా టైంను వేస్ట్ చేశాడని చైతు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక చైతన్యతో చేయాల్సిన సినిమాను విజయ్ దేవరకొండతో చేశాడు పరుశురాం. కానీ ఇప్పుడు రిజల్ట్ రివర్స్ అవడంతో.. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు చైతన్య, అల్లు అరవింద్ లోలోపల ఫుల్ ఖుషీ అవుతున్నారని చెవులు కొరుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.