తమిళ గిల్లి సినిమా తెలుగులో పోకిరికి రీమేక్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మికా మందన్న చెప్పారు. తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గిల్లి అని, అందులో ఓ పాట తనకెంతో ఇష్టమని తెలిపారు. అయితే ఆ సినిమా మహేష్ బాబు నటించిన ఒక్కడుకి రీమేక్ కావడంతో నెటిజన్లు రష్మిక వీడియోను వైరల్ చేశారు. ఈ విషయంలో సారీ చెబుతూ రష్మిక సరదా పోస్ట్ పెట్టారు. ‘అవును గిల్లి ఒక్కడుకి రీమేక్. ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా.. నిజంగా సారీ’ అని పేర్కొన్నారు.