ప్రముఖ హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు జేనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన సినిమా ‘డ్రైవ్’. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీజర్ ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. ఇక భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.