అప్పుడప్పుడు హీరోలు కూడా హర్ట్ అవుతుంటారని ఇండస్ట్రీలో వినిపిస్తునే ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడని పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ విషయంలో హర్ట్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ఆచార్య మూవీతో మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు. మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశకు గురయ్యారు. అందుకే చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అది కూడా శంకర్ వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేస్తుండడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే ఆర్సీ 15 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవకముందే.. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ని తిరిగి పట్టాలెక్కించాడు శంకర్. అంతేకాదు ఈ రెండు సినిమాలను ఈక్వల్‌గా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఇదే విషయంలో చరణ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది. ‘ఇండియన్ 2’ లైన్లోకి రాకముందు.. ఆర్సీ 15 పై ఎంతో కేరింగ్ తీసుకున్నాడ శంకర్. కానీ ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని ఇండస్ట్రీ వర్గాల మాట. దాంతో చరణ్ హ్యాపీగా లేరని.. అందుకే ఆర్సీ 16ని కోసం చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. పక్కా ప్లానింగ్‌తో.. క్లియర్ కట్ క్లారిటీతో శంకర్ ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయినా శంకర్ రిస్క్ చేస్తున్నాడనే అంటున్నారు.