లైగర్ హిట్ అయితే ఎలా ఉండేదో కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అవడమే సంచలనంగా మారింది. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెంటర్ ఆఫ్ ది న్యూస్‌గా మారిపోయాడు. దాంతో రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూరి పనైసయింది.. పూరి మార్క్ మిస్ అయింది.. పూరి పెన్ పవర్ తగ్గిపోయిందని వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా లైగర్ దెబ్బకు పూరి ఆర్థికంగా దెబ్బ తిన్నాడనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మొత్తంగా లైగర్ ఎఫెక్ట్ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన పై పడిందనేది పూరికి పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం పూరి లైగర్ నష్టాలను పూడ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో పూరి ముంబై నుంచి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. అది కూడా బడ్జెట్ కంట్రోల్లో భాగంగానే అని టాక్.
గత కొన్నేళ్లుగా లైగర్ కోసం ముంబైలో ఉంటున్నాడు పూరి. అందుకోసం పూరి టీమ్‌కు భారీగానే ఖర్చు అయినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. పూరి ఉండే విలాసవంతమైన ఫ్లాట్ రెంట్ నెలకి 10 లక్షలట. రెంటే అంత మొత్తంలో ఉంటే.. మెయింటనేన్స్ కలుపుకుంటే అది ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుందని.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే పూరి జగన్నాధ్ ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చేశాడని అంటున్నారు. అయితే పూరికి నష్టాల పాలవడం కొత్తేం కాదు. అలాంటి సమయాల్లో పూరి పై ఎన్నో పుకార్లొచ్చాయి. కానీ ఈ సారి మాత్రం కాస్త ఎక్కువగా అలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అసలు అద్దె కూడా కట్టలేని స్థితిలో పూరి ఉన్నాడా.. అనేది కాస్త సందేహంగానే ఉంది. ఏదేమైనా పూరి పై రోజుకో పుకారు షికారు చేస్తునే ఉంది.