Lokesh Kanagaraj: తీసిన ప్రతి సినిమా హిట్ అవడం అనేది రేర్. అందరు డైరెక్టర్లకు కుదిరదు. చాలా తక్కువ మంది దర్శకులకు హిట్స్ వస్తుంటాయి. అలాంటి వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. ఆయన సినిమాలకు జనం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఆయనతో మూవీస్ చేసేందుకు స్టార్ హీరో, హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
గత ఏడాది కమల్ హాసన్‌తో తీసిన విక్రమ్ (vikram) సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసు. అంతకుముందు విజయ్‌తో తీసిన మాస్టర్, కార్తీతో ఖైదీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం లియోతో బిజీగా ఉన్నాడు. లోకేష్ తాజా స్టేట్ మెంట్ అభిమానులను కలవరపరిచేలా ఉంది. తాను ఎక్కువ సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి రాలేదని, ఓ పది తీశాక రిటైర్ అయిపోతానని చెప్పాడు.
లియో మూవీ మినహాయించి ఇంకో అయిదు సినిమాలు మాత్రమే వస్తాయన్న మాట. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌లో భాగంగా తాను తీసిన కథల్లోని హీరోలందరినీ ఒక చోట కలుపుతానని, అవెంజర్స్ లాగా వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచేలా చేస్తానని అంటున్నాడు. ఇందుకు సదరు హీరోలు, నిర్మాతలు అభ్యంతరం లేదని ఒప్పుకుంటే తప్ప అది సాధ్యపడదని కూడా క్లారిటీ ఇచ్చాడు.
లోకేష్ ప్లాన్ చేసుకున్న వాటిలో విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ఉన్నాయి. రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపించారు. కానీ తెలుగు డెబ్యూ మూవీ చేస్తాడా అన్నది కాస్త డౌట్‌గానే ఉంది. కొన్ని సినిమాలు చేసి తప్పుకుంటామని చెప్పడంతో సినీ జనాలు నిరాశలో ఉన్నారు.