ఈ మధ్య మలయాళం సినిమాలు ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఫహాద్ ఫాజిల్(Fahaad Fassil) హీరోగా తెరకెక్కిన ‘ధూమం’ సినిమా(Dhoomam Movie) తెలుగు ట్రైలర్ రిలీజ్(Trailer release) అయ్యింది. మలయాళంలో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీని కేజీఎఫ్, కాంతార వంటి భారీ సినిమాలను తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. యూటర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ ఈ మూవీ దర్శకత్వం వహించారు.
ధూమం సినిమా(Dhoomam Movie) జూన్ 23న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తోంది. డబ్బు, కిడ్నాప్, పోలీసులు, ఛేజింగ్స్ నేపథ్యంలో సాగే సీన్స్ ను కట్ చేసి ట్రైలర్(Trailer Release)గా వదిలారు.
ఈ మూవీ(Dhoomam Movie) లో ఫహాద్ ఫాజిల్(Fahaad Fassil)కు జోడీగా అపర్ణ బాలమురళి(Aparna balamurali) కనిపించింది. రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్, అనూ మోహన్, వినీత్ వంటివారు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది. 23న ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల(Release) చేయనున్నారు.