క్రాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అయితే ఈసారి పేరుకు తగ్గట్టే.. మాస్ మహారాజా థియేటర్లో మాస్ జాతరను ఫుల్ ఫిల్ చేసేలానే ఉన్నాడు. ప్రస్తుతం ‘ధమాకా’ అనే ఫక్తూ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘ధమాకా’ తెరకెక్కుతోంది. రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో అందించిన ట్యూన్స్ హైలెట్‌గా నిలిచాయి. ఇప్పటికే జింతాక్, మాస్ రాజా వంటి మాస్ బీట్స్ దుమ్ములేపాయి. అలాగే మిగతా సాంగ్స్ కూడా మాస్ ఆడియెన్స్‌కు కిక్ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతకు మించి అనేలా మరో మాస్ ట్యూన్ రాబోతోంది. తాజాగా ధమాకా నుంచి ‘దండకడియాల్’ అంటూ సాగే మాస్ ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రోమోతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఈ సాంగ్. అలాగే విజువల్ పరంగా అదిరిపోయేలా ఉన్నట్టే కనిపిస్తోంది. దీని ఫుల్ లిరికల్ సాంగ్‌ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ సారి మాస్ మహారాజా మాసివ్ టార్గెట్‌తో రాబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. మరి ధమాకాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.