»Deveri Video Song Is Out From Allari Naresh Ugram
Ugram Movie: ‘ఉగ్రం’ నుంచి ఫీల్ గుడ్ దేవేరి వీడియో సాంగ్ రిలీజ్
పోలీస్ ఆఫీసర్ అయిన నరేశ్(Allari Naresh) హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగి పాడుకునే పాట ఇది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ సినిమాలో మలయాళ నటి మిర్ణా ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీకి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగులను అందిస్తున్నారు.
ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులను నవ్వించే అల్లరి నరేశ్(Allari Naresh) నాంది సినిమా నుంచి తన రూట్ మార్చుకున్నాడు. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో ఉగ్రం(Ugram) అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి దేవేరి అనే వీడియో సాంగ్(Deveri Video Song) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను విజయ్ దేవరకొండ(VijayDevarakonda) మూవీ టీమ్ కలిసి లాంచ్ చేశాడు.
‘ఉగ్రం’ మూవీ నుంచి ఫీల్ గుడ్ దేవేరి వీడియో సాంగ్:
విజయ్ దేవరకొండ(VijayDevarakonda) మాట్లాడుతూ..ఉగ్రం(Ugram) సినిమా నుంచి దేవేరి సాంగ్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. దేవేరి గుండెల్లో చేరి..మదిలో మోగిందే సరిగమ సావేరి అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాటను శ్రీమణి రాశారు. శ్రీచరణ్ పాకాల పాటను కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడాడు.
పోలీస్ ఆఫీసర్ అయిన నరేశ్(Allari Naresh) హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగి పాడుకునే పాట ఇది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ సినిమాలో మలయాళ నటి మిర్ణా ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీకి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగులను అందిస్తున్నారు. మే 5వ తేదిన ఉగ్రం(Ugram) సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.