»Delhi Police Write Letter To Meta For Rashmika Deepfake Video Data
Rashmika డీప్ ఫేక్ వీడియో వివరాలు ఇవ్వండి.. మెటాకు పోలీసుల లేఖ
రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎవరూ క్రియేట్ చేశారు.? ఏ యూఆర్ఎల్ నుంచి వీడియో అప్ లోడ్ అయ్యిందనే సమాచారం ఇవ్వాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika) డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వీడియో ఎవరు షేర్ చేశారు..? ఏ యూఆర్ఎల్ నుంచి వీడియో అప్ లోడ్ అయ్యింది.. తర్వాత ఎవరు పంచుకున్నారనే సమాచారం ఇవ్వాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాశారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారి వివరాలు కూడా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియో కేసును స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగెట్ చేస్తోంది. ఎవరు చేశారనే విషయం త్వరలో తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సోషల్ మీడియా స్టార్ తార జారా పటేల్ వీడియోకు రష్మిక మొహం పెట్టి వీడియో క్రియేట్ చేశారు. దానిని షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోపై బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్, ఇతర తారలు, రాజకీయ నేతలు కల్వకుంట్ల కవిత తదితరులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత రష్మిక స్పందిస్తూ.. అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది.