‘గదర్ 2’లో అత్తయ్య పాత్రలో కనిపించమంటే నటి అమీషా పటేల్ చేయనన్నారని దర్శకుడు అనిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా దీనిపై అమీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు. ‘మూవీలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది పూర్తిగా నా అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. రూ.100 కోట్లు ఇచ్చినా మీ సినిమా అనే కాదు ఏ సినిమాలోనూ అత్త పాత్ర చేయను’ అంటూ రాసుకొచ్చారు.