రెండు ఏళ్ల క్రితం వచ్చిన ‘ఒదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్గా వస్తున్న చిత్రం ‘ఒదెల-2’. కాగా, ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా తమన్నా బర్త్డే సందర్బంగా మూవీ మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ నిర్మిస్తుండగా.. అశోక్ తేజా దర్శకత్వం వహిస్తున్నాడు.