ఈ సారి సంక్రాంతి వార్ ఏ రేంజ్లో ఉండబోతోంది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ కొత్తది కాకపోయినా.. ఈ సారి కోలీవుడ్ హీరో విజయ్ కూడా బరిలో ఉండడం ఆసక్తికరంగా మారంది. అలాగే అజిత్ కూడా సై అంటున్నాడు.
అయితే అజిత్ ‘తునివు’ సినిమాను పక్కన పెడితే.. విజయ్ ‘వారసుడు’ తమిళ్ సినిమానే అయినా.. దిల్ రాజు నిర్మిస్తుండడంతో.. తెలుగులో థియేటర్ల దగ్గర గట్టి పోటీ తప్పేలా లేదు. పైగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు నిర్మాత ఒకరే.. మైత్రీ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించింది. అందుకే ఈ సారి బాక్సాఫీస్ వార్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతోంది.
అందుకు తగ్గట్టే పోటీ కూడా మొదలైపోయింది. ప్రస్తుతం ఈ సినిమాల మధ్య ఓవర్సీస్ బిజినెస్ వార్ జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓవర్సీస్లో కోలీవుడ్ హీరోల కంటే చిరు, బాలయ్య వెనకబడిపోయినట్టు తెలుస్తోంది. విజయ్ ‘వారిసు’ సినిమాకు 35 కోట్లు.. అజిత్ ‘తునివు’కు 13 బిజినెస్ జరిగిందట.
కానీ చిరు, బాలయ్య సినిమాలు 10 కోట్ల లోపే బిజినెస్ జరిగిందని అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ 8.5 కోట్లు.. ‘వీరసింహారెడ్డి’ 5.5 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయినట్టు సమాచారం. దాంతో ఓవర్సీస్లో విజయ్ డామినేషన్ ఎక్కువగా ఉందంటు హల్ చల్ చేస్తున్నారు దళపతి అభిమానులు. ప్రస్తుతం ఈ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఓవర్సీస్ బిజినెస్ ఇలా ఉంటే.. థియేట్రికల్ బిజినెస్ ఇంకెలా ఉంటుందో చూడాలి.