ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ జరగబోతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరు సంక్రాంతి వార్‌కు రెడీ అవుతుండడంతో.. ఇంట్రెస్టింగ్గా మారింది. పైగా ఆదిపురుష్ కూడా ఆదిపురుష్ పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి.. చిరు, బాలయ్య మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. అలాగే అఖిల్ ‘ఏజెంట్’ కూడా తప్పుకునే అవకాశాలున్నాయి.
అయితే విజయ్ ‘వారసుడు’ మాత్రం సంక్రాంతి బరిలో నిలిచేలానే ఉంది. కానీ ఇది డబ్బింగ్ మూవీ కావడంతో.. సంక్రాంతి వార్ బాలయ్య వర్సెస్ చిరుగా ఫిక్స్ అయిపోయినట్టే. ఫ్యాన్స్ కూడా ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఇద్దరిలో ఎవరు ముందు థియేటర్లోకి రావాలనే విషయం తేలడం లేదని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రిస్క్ అయినా.. సీనియర్ హీరోలు కమిట్ అయిపోయారు కాబట్టి.. సంక్రాంతికి రిలీజ్ చేయక తప్పడం లేదు. ఇప్పటికే థియేటర్స్ కేటాయించడం దగ్గర నుంచి.. ప్రమోషన్స్ వరకూ.. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం.. మేకర్స్‌కు కష్టంగా మారిందని వినిపిస్తోంది. అయితే ఇప్పుడు థియేటర్లోకి ఎవరు ముందు రాబోతున్నారనే విషయంలోను పోటీ ఏర్పడుతోంది. ముందుగా థియేటర్లోకి వచ్చే హీరోకి హైప్ కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఇక ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే నెక్ట్స్ డే వచ్చే సినిమాకు థియేటర్ల కొరత తప్పదు..
అందుకే ముందు నేనంటే నేను అంటున్నారి. అయితే ఈ రెండు సినిమాలను వన్ డే గ్యాప్‌తో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం బాలయ్య ముందుగా రాబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు.