»Chiranjeevi Big Project With An Unexpected Director
Chiranjeevi : ఊహించని డైరెక్టర్‌తో చిరంజీవి భారీ ప్రాజెక్ట్!
Chiranjeevi : టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు లిస్ట్‌లో నుంచి ఎగిరిపోయారు.
టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు లిస్ట్‌లో నుంచి ఎగిరిపోయారు. కానీ పూరి జగన్నాథ్, వివి వినాయక్ మాత్రం చిరుతో లైన్లో ఉన్నారు. అయితే వీళ్లతో సినిమాలు ఎప్పుడుంటాయో ఇప్పుడే చెప్పలేం. ఈ క్రమంలో నెక్స్ట్ మెగాస్టార్ ప్రాజెక్ట్ ఎవరితో.. అనేది సస్పెన్స్‌గా మారింది. కానీ ఇప్పుడు బింబిసార డైరెక్టర్‌కు చిరు ఓకే చెప్పారనే న్యూస్ వైరల్‌గా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన ఫస్ట్ సినిమా బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట. ఈ సినిమా తర్వాత బింబిసార సీక్వెల్ చేయబోతున్నట్టు అప్పుడే ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లేలా లేదు. అందుకే ఈ లోపు స్టార్ హీరోలను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు మల్లిడి వశిష్ట. ఆ మధ్య రజనీకాంత్‌కు కూడా ఓ కథ చెప్పాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరుకి కథ చెప్పగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. పాన్ ఇండియా లెవల్లో సోసియో ఫాంటాసీ డ్రామాగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించనుందట. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయిందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.