Chinamayi : సింగర్ చిన్మయి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కేవలం సింగర్‌గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఫేమస్. అందులోనూ సమంతకు డబ్బింగ్ చెప్పడంతో చిన్మయికి చాలా పాపులారిటీ వచ్చింది. ‘మీ టూ’ ఉద్యమంలో తమిళ సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేయడం వల్ల తమిళ ఇండస్ట్రీలో నిషేధానికి గురయ్యింది. నాలుగేళ్ల తర్వాత చిన్మయి ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. హీరో విజయ్, త్రిష కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానున్నది.
హీరోయిన్ త్రిష పాత్రకు తెలుగు, తమిళం, కన్నడలో డబ్బింగ్ చెప్పినట్లు చిన్మయి సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. లోకేష్ కనగరాజ్, హీరో విజయ్‌కు ధన్యవాదాలు తెలిపింది. చిన్మయి తమిళ ఇండస్ట్రీలో నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో సమంత ఆనందం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన లింక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫైర్ ఎమోజీని యాడ్ చేసింది. ‘ఏం మాయ చేశావే’ సినిమా నుంచి చిన్మయికి, సమంతకు పరిచయం ఉంది. వీళ్లు మంచి స్నేహితులు కూడా. సమంత సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే.’మీ టూ’ ఉద్యమంలో భాగంగా అప్పట్లో డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవిపై సంచలన ఆరోపణలు చేసింది. సౌత్ ఇండియన్, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ చిన్మయిపై బ్యాన్ విధించింది