TG: శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే, తనపై కేసు పెట్టారని తెలిసి ఆ కుటుంబాన్ని కలవలేకపోయానన్నారు. తనకు అనుమతి ఇస్తే ఇప్పుడే వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని వెల్లడించారు. వారి కుటుంబాన్ని తన తండ్రి స్వయంగా వెళ్లి పరామర్శించారని తెలిపారు. తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా వేడుకలన్నీ రద్దు చేసుకున్నామన్న బన్నీ.. తాము మానవత్వాన్ని నమ్మే మీడియా ముందుకు వచ్చామన్నారు.