»Bigg Boss Beauty Neha Chaudharys Sensational Post Saying That She Hates Her Husband
Neha Chowdary: భర్తను ద్వేషిస్తున్నా అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన పోస్ట్
బిగ్ బాస్ బ్యూటీ నెహా చౌదరి తన భర్తను ద్వేషిస్తున్నట్లు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన భర్త పెద్దగా గురక పెడుతాడని, ఐస్ క్రీమ్, చాక్లెట్లు తనకు ఇవ్వకుండా తినేస్తాడని ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Bigg Boss beauty Neha Chaudhary's sensational post saying that she hates her husband
Neha Chowdary: బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మల్టీ టాలెంటెడ్ యాంకర్ నేహా చౌదరి అందరికి సుపరిచితురాలే. బుల్లితెర ప్రజెంటర్ గా, మోడల్, యోగా ట్రైనర్, డ్యాన్సర్, స్విమ్మర్, అథ్లెట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ ఆరో సీజన్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ షో ప్రారంభంలోనే ఎలిమినేట్ అయింది. ఇంట్లో వాళ్ల కోరిక మేరకు తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను బిగ్‌బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే పెళ్లి చేసుకుంది.
భర్తతో కలిసి అప్పుడప్పుడూ ఇన్‌స్టా రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. భర్తను ద్వేషిస్తున్నట్టు ఓ పోస్ట్ పెట్టింది. అతనితో కలిసున్న ఓ పిక్ పెట్టి ఇలా రాసుకొచ్చింది. ‘నేను నిన్ను ఎంతగానో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అందుకే కావచ్చు దీన్ని పెళ్లి అంటారు. నువ్వు ఎంత పెద్ద గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, ఐస్‌క్రీమ్ , చాక్లెట్లు ఇవ్వకుండా నువ్వే తినేసినా, నేను చెప్పిన పని ఏది చేయ్యకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు సారీ చెప్పి, మళ్లీ రిపీట్ కాదని ప్రామిస్ చేస్తావు… వెంటనే 5 మినిట్స్‌లో అది బ్రేక్ చేస్తావు… అయినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను ఎప్పుడో ఫిదా అయ్యాను. నువ్వెప్పటికీ నా వాడివే అని’ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.