ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో రెండింటి పై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని అంటున్నారు. మరి భీమా వర్సెస్ గామిగా ఉన్న బాక్సాఫీస్ వార్‌లో ఎవరి టార్గెట్ ఎంత?
Bhima vs Gaami: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ ఇంట్రెస్టింగ్గా మారింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న గోపీచంద్.. ఈ వారం భీమా అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు డివోషనల్ టచ్ ఇస్తూ.. కన్నడ డైరెక్టర్ ఏ.హర్ష తెరకెక్కించాడు. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. మంచి బజ్ జనరేట్ అయింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా రూ. 11.5 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో భీమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ధమ్కీ తర్వాత గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీని దర్శకుడు విధ్యాధర్ కాగిత తెరకెక్కించాడు. డిఫరెంట్ కంటెంట్ కావడంతో గామి పై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. గామి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ. 10.5 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
మొత్తంగా.. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గామి రిలీజ్ అవుతోంది. అయితే.. బిజినెస్ విషయంలో భీమాదే పై చేయిగా ఉన్నప్పటికీ.. బుకింగ్స్ విషయంలో మాత్రం గామిదే పై చేయి అని అంటున్నారు. దీంతో.. ఫస్ట్ డే భీమా కంటే గామి ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటాయో చూడాలి.