Bhagavanth Kesari: రెండు రోజుల్లోనే బాలయ్య హాఫ్ సెంచరీ!
దసరా రేసులో బాలయ్య హవా నడుస్తోంది. నందమూరి నటసింహం లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే భారీ గ్రాస్ సొంతం చేసుకున్న బాలయ్య.. రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ జోష్‌లో వచ్చిన బాలయ్య(balakrishna) ‘భగవంత్ కేసరి(Bhagavanth Kesari)’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను సరికొత్తగా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి.. మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఫస్టే డే రూ.33 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్ రెండో రోజు కూడా దుమ్ముదులిపేసింది. రెండో రోజు బాలయ్యకు పోటీగా మాస్ మహారాజా ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరోవైపు దళపతి విజయ్ ‘లియో’ నుంచి గట్టి పోటీ ఉంది. అయినా కూడా భారీ వసూళ్లను అందుకున్నాడు నేలకొండ భగవంత్ కేసరి.
మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా రెండు రోజుల్లో రూ.51 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్కు రెడీ అవుతున్న బాలయ్య.. రెండు రోజుల్లోనే హాప్ సెంచరీ కొట్టేసి.. సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఇక యూఎస్‌లో 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్‌ని టచ్ చేసి 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో ఈ సినిమా బాలయ్య కెరీర్లో బెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్, మెసేజ్‌తో భగవంత్ కేసరి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. బాలకృష్ణ, శ్రీలీల కాంబినేషన్.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. తమన్ మ్యూజిక్ భగవంత్ కేసరి సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా.. లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.