మలయాళ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘బరోజ్’. తాజాగా ఈ మూవీపై మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వాస్కోడిగామాలో ఉన్న రహస్య నిధిని నిజమైన వారసుడికి అందించడానికి బరోజ్ చేసే ప్రయత్నాలే మూవీ కథ. టెక్నాలజీని వాడుకుని యూనిక్‌గా 3డిలో తీశాం. ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు’ అని చెప్పారు. ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతుంది.