బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీకి విడుదలకు ముందే బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ విడుదల ఆపాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ.. ‘అఖండ 2’ విడుదలను ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఆ మూవీ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ తమకు రూ.28 కోట్ల నష్టాలను చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించేంతవరకు మూవీ విడుదలను నిలిపివేయాలని కోరింది.