హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో తన పాటలను అనుమతి లేకుండా వాడారని సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ‘ఇళమై ఇదో ఇదో’, ‘ఒత్త రూబాయుం తారెన్’, ‘ఎన్ జోడి మంజకరువి’ వంటి పాటలను సినిమా నుంచి తొలగించాలని, అలాగే రూ.5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. కాగా, ఈ కేసు విచారణ ఈనెల 8న జరగనుంది.